![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -388 లో.. కృష్ణ, మురారి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కృష్ణ, మురారి, ఆదర్శ్ ముకుంద కలిసి గుడికి బయలుదేరుతారు. అందరు ఒక దగ్గరే ఉన్నా కూడా కనీసం మాట్లాడుకోకుండా వెళ్తారు. అది గమనించిన కృష్ణ.. మీరు కార్ ఆపండి. సరదాగా బయటకు వస్తే ఎవరికి వారే దిక్కులు చూస్తున్నారని కృష్ణ అంటుంది.
ఆ తర్వాత కృష్ణ ఒక పాట పెడుతుంటే మురారి ఇంకొక పాట పెడుతాడు. ఈ సిచువేషన్ లో ఈ కృష్ణ పెట్టిన పాట సెట్ అవుతుందని ఆదర్శ్ అంటాడు. అంటే కృష్ణ నువ్వు ఒక పార్టీ.. నేను మురారి ఒక పార్టీ.. మేమ్ ఇద్దరం ఒకటి అని ముకుంద అనగానే వాళ్ళు షాక్ అవుతారు. అంటే పాటలు విషయంలో అని ముకుంద అంటుంది. ఆ తర్వాత గుడికి వస్తారు. ఆదర్శ్, ముకుంద ఇద్దరు ఎందుకు అలా వుంటున్నారని కృష్ణ, మురారి అనుకుంటారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళు రావడం లేదేంటని ఆదర్శ్ తో ముకుంద అనగానే వాళ్ళు మనం ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు కానీ మనం దూరంగా ఉంటున్నాం. నువ్వు నన్ను తీసుకొని రమ్మని పంపించావ్. ప్రేమ ఉంది కాబట్టి కానీ నేను రాగానే నాపై ప్రేమ చూయించాలని లేదు టైమ్ పట్టుతుందని ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత అందరు గుడికీ వెళ్లి దేవునికి మొక్కుకుంటారు. పిల్ల పాపలతో రావాలని పంతులు గారు అనగానే.. మురారి బిడ్డ పుట్టేది మా ఇద్దరిలో ఒక్కరికే అని ముకుంద మనసులో అనుకుంటుంది. అయ్యో నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను.. నేను కృష్ణకి అన్యాయం చెయ్యలేను అలా అని ఆదర్శ్ కి దగ్గర కాలేనని ముకుంద అనుకుంటుంది.
ఆ తర్వాత కృష్ణ, ముకుంద ఇద్దరు ద్వాజ స్థంభం దగ్గర దీపము పెడుతుంటే.. పై నుండి గంట కింద పడుతుంది. అది చూసి కృష్ణ గతం లో జరిగిన సంఘటనలు గుర్తుకు చేసుకుని టెన్షన్ పడుతుంది.. ఆ తర్వాత ఆదర్శ్ కొబ్బరికాయ కొడుతుంటే అప్పుడే తన చేతికి దెబ్బ తగులుతుంది. ఆ విషయం ముకుంద పట్టించుకోకుండా పరధ్యానంలో ఉంటుంది. ఏంటి ముకుంద.. ఆదర్శ్ చెయ్యి నలిగి పోయిందని కృష్ణ చెప్తుంది. ముకుంద మాత్రం ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకొని చెయ్యి పట్టుకుంటుంది. తరువాయి భాగంలో అందరూ రెస్టారెంట్ కి వెళ్తారు. ఆదర్శ్ చెయ్యికి దెబ్బ తగలడంవల్ల తినలేకపోతాడు. నువ్వు తినిపించు ముకుంద అని కృష్ణ అనగానే.. ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |